Revanth Reddy: ప్రస్తుతం దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో డ్రైపోర్టు నిర్మిస్తామని వెల్లడించారు. దాన్ని ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తామని వివరించారు. రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ వైపు చూడాలని ఈ సందర్భంగా బిజినెస్‌మెన్‌లకు రేవంత్ పిలుపునిచ్చారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే తమ లక్ష్యానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.