ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ ఈ విషయాన్ని ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ ఆర్ఎంజెడ్ సంస్థతో చర్చలు జరపగా.. చర్చలు ఫలించి ఆ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నంతో పాటుగా.. రాయలసీమలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.