Balapur Ganesh Laddu Rs 39 Lakhs To Sama Praneeth Reddy: హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ముగిసింది. 2026 వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్ మహాగణపతి 21 కిలోల లడ్డూ ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. సామ ప్రణీత్ రెడ్డి ఏకంగా రూ.39 లక్షలకుదక్కించుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రస్థానం.. ఈసారి రూ.39 లక్షలకు చేరింది. ఈ వేలం ద్వారా వచ్చే సొమ్ముతో బాలాపూర్ గ్రామంలో అభివృద్ధితో పాటుగా పలు ఆలయాలు, ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు.