Sankranti: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులు పండగ చేసుకున్నారు. సంక్రాంతి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక చివరి రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు మద్యం దుకాణ యజమానులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు పేర్కొంటున్నారు.