Holidays due to Heavy rains in Andhra pradesh: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్రవాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. వచ్చే 24 గంటల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమం రద్దు చేశారు.