తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్(ఈదుల్ ఫితర్) పండుగ సందర్భంగా మార్చి 31 వ తేదీతో పాటు ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది. అలాగే జమాతుల్-విదాను పురస్కరించుకుని మార్చి 28న ఆప్షనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం.. మైనారిటీ విద్యాసంస్థలు రేపు విద్యార్థులకు సెలవు ప్రకటించాయి. దీంతో పాటు.. విద్యార్థులు, ఉద్యోగులకు ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.