ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, డిజిటలైజేషన్‌కు నేటి (సోమవారం) అర్ధరాత్రితో గడువు ముగియనుంది. రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లకు పత్రాలు అందించగా.. 2.64 కోట్ల మంది వివరాలు ఇప్పటికే డిజిటలైజేషన్ అయ్యాయి. 69 లక్షల మంది పత్రాలు సమర్పించకపోవడంతో వారి వివరాలు అన్‌కలెక్టబుల్ విభాగంలో ఉన్నాయి. ఆగస్టు 17న ముసాయిదా జాబితా విడుదల కానుంది. సందేహాస్పద ఓటర్లకు అక్టోబరు 15 వరకు నోటీసులు ఇచ్చి గుర్తింపు పత్రాలతో వివరణకు అవకాశం కల్పిస్తారు. అక్టోబరు 19న తుది జాబితా ప్రకటిస్తారు.