తెలంగాణలో కోటి మంది ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కొడంగల్ నియోజకవర్గంలోనే 80 వేల ఓట్లు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఓటర్లతో పాటు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన పేదలు, కూలీలు, కార్మికుల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బూత్‌ల వారీగా వ్యతిరేక ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించిన సీఎం.. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.