Hyderabad Srisailam Elevated Corridor Alignment: హైదరాబాద్–శ్రీశైలం ఎన్‌హెచ్-765పై ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు. నల్లమల కొండల మీదుగా కాకుండా.. మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు 55 కిలోమీటర్ల ప్రస్తుత రహదారి వెంటే నిర్మించాలని నిర్ణయించారు. తొలుత రెండు లేన్లుగా నిర్మించి.. భవిష్యత్తులో నాలుగు లేన్లకు విస్తరించేలా డిజైన్లు రూపొందిస్తున్నారు. ప్రమాదకరమైన మలుపులను సరిచేసేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. కొత్త అలైన్‌మెంట్ ప్రక్రియ పూర్తికాగా.. డీపీఆర్ తయారీ కొనసాగుతోంది. కేంద్ర అనుమతులు, నిధుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.