నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. మార్చి 27 నుంచి 31 వరకూ శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు స్పర్శ దర్శనాలు రద్దు చేసింది. మార్చి 26 నుంచి మార్చి 31 వరకూ శ్రీశైలంలో స్పర్శదర్శనాలు రద్దు చేశారు.