సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. పుంగనూరులో మంగళవారం ప్రారంభమైన జాతర రెండు రోజుల పాటు జరగనుంది. ఈ జాతరకు పొరుగున ఉన్న జిల్లాల నుంచి మాత్రమే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు, గొర్రెల వ్యాపారులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ సప్తగిరి గంగమ్మ ఆలయంపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. దీంతో ఈ ఆలయ విశేషాల కోసం నెటిజనం ఆసక్తి చూపుతున్నారు.