Telangana 4E Strategy: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలకు చెక్‌.. 4E విధానం అమలు, అసలేంటీ విధానం..!

1 hour ago 1
Telangana Road Safety: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు 4E విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ సపోర్ట్‌ అంశాల ఆధారంగా కార్యాచరణ చేపట్టనున్నారు. అధిక ప్రమాదాలు నమోదవుతున్న ఏడు జిల్లాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించడంతోపాటు రహదారుల్లోని లోపాలను గుర్తించి సరిచేయాలని సూచించారు. కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, అధికారులు, సేవ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు.
Read Entire Article