Telangana Dengue: తెలంగాణలో డెంగీ విజృంభణ.. 15 ఏళ్ల బాలుడు మృతి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి

1 hour ago 1
Teenager Dies of Dengue: తెలంగాణలో డెంగీ కలకలం రేపుతోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన 15 ఏళ్ల యశ్వంత్‌ డెంగీతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరిన బాలుడు సోమవారం రాత్రి కన్నుమూశాడు. అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు డెంగీ లక్షణాలు. తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, జ్వరం వస్తే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చునని అంటున్నారు. జ్వరం తగ్గిన తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article