పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో పది ప్రధాన రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్ కల్పించింది. రాజ్‌కోట్, పోరుబందర్, తిరుపతి, బెంగళూరు, పుణె మార్గాల్లో నడిచే రైళ్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ బోర్డింగ్ పాయింట్‌ను హైటెక్ సిటీకి ఉచితంగా మార్చుకోవచ్చునని రైల్వే అధికారులు తెలిపారు.