Telangana High Court: అనుకున్నదే జరిగింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేయడంతో ఆయన అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది.