Telangana High Court: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 21వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించేందుకు సిద్ధం కాగా.. పోలీసులు అందుకు నిరాకరించారు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.