Telangana Rice Market: సామాన్యులకు నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ధాన్యం క్వింటాకు రూ.3,300 నుంచి రూ.3,700 వరకు చెల్లించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రబీ సీజన్ ధాన్యాన్ని రూ.4 వేల నుంచి రూ.4500 చెల్లించి ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది.ప్రస్తుతం సన్న బియ్యం కిలో ధర రూ.80–85 ఉండగా.. రానున్న రోజుల్లో రూ.100–110కు చేరవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం.