ఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి డిస్కంలు నివేదిస్తాయి. ఈ ఏడాది పెంచడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నపించాయి. అయితే, ఛార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిస్కంలకు సూచించారు. దీంతో ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకుని.. తమ వార్షిక నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి. ఈ క్రమంలో వచ్చే ఆర్దిక సంవత్సరంలో లోటు ఎంత.. ఆదాయం ఎంత అనేది నివేదించాయి.