సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు. తమ కుమార్తె కావ్యా మారన్ వివాహ రిసెప్షన్కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ నవంబర్ 21న చెన్నైలో జరగనున్నట్లు ఆహ్వాన వివరాల్లో పేర్కొన్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ వివాహంపై చాలా రోజులుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వీరి వివాహ తేదీ, వేదికపై అధికారిక ప్రకటన వెలువడలేదు.