సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొడంగల్ యు శేఖర్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తన ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో వైరల్ చేసి.. వాటి ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెడుతున్నారని ఆరోపించారు. తాను ఆర్డర్ చేయని వస్తువులు ఇంటికి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో విడుదల చేశారు. తన పేరు మీద వచ్చే పార్సిళ్లను స్వీకరించబోనని.. వాటికి డబ్బులు చెల్లించబోనని డెలివరీ సిబ్బందికి స్పష్టం చేశారు.