ఓవైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు స్థానిక ఎన్నికల సందడి తెలంగాణలో ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరితోనే పంచాయతీల పదవీకాలం ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు జరిపించాల్సి ఉన్నా.. బీసీ రిజర్వేషన్ల అంశం ఆటంకంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. దీని ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయిస్తారు.