Telangana Budget 2026: తెలంగాణ ప్రభుత్వం నేడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 2025-26 పద్దు రూ.3.04 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.3.30 లక్షల కోట్లు బడ్జెట్ ఉంటున్నట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి కీలక పథకాలకు భారీగా నిధులు కేటాయించాలని నిర్ణయించింది. బడ్జెట్ లైవ్ అప్డేట్స్ మీకోసం..