తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. పరీక్షలను వచ్చే సంవత్సరం.. జనవరి 3, 2026 నుంచి 31వ తేదీ వరకు సుదీర్ఘ కాలంలో నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.