తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన 562మంది అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ లభించింది. ఫలితాలపై తెలంగాణ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. గతంలో మెరిట్ లిస్టును రద్దు చేసి మెయిన్స్ పేపర్స్ మళ్లీ మూల్యాంకనం చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ధర్మాసనం రద్దు చేసింది.