TG: భూ భారతి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి.. కారణం ఏంటంటే..

10 months ago 20
మహబూబ్‌నగర్ జిల్లా రేవల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అకారణంగా విధులకు గైర్హాజరు కావడంతో.. భూభారతి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోతున్నయాంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, మార్పులు-చేర్పులు కోసం రుసుము చెల్లించి తేదీలు ఖరారు చేసుకున్న రైతులు, ప్రజలు పనులు పూర్తికాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు ఇన్‌ఛార్జిని నియమించకపోవడంతో.. విలువైన సమయాన్ని కోల్పోయి వెనుదిరుగుతున్నారు. బ్యాంకు రుణం కోసం వచ్చిన ఒక మహిళా రైతును కూడా తహశీల్దార్ వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Entire Article