తెలంగాణ రాష్ట్రంలో నకిలీ కార్డుల ఏరివేతలో భాగంగా.. 2025 అక్టోబర్ వరకు ఏకంగా 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను తెలిపారు. అనర్హుల గుర్తింపు, నకిలీ కార్డుల ఏరివేత, కుటుంబ సభ్యుల మరణాలు వంటి కారణాలతోనే ఈ రద్దు జరిగింది. కేవలం ఈ-కేవైసీ పూర్తి కాలేదనే కారణంతో ఏ ఒక్క కార్డునూ రద్దు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 56.60 లక్షల రేషన్ కార్డులు అమలులో ఉన్నాయి.