తెలంగాణ సెక్రటేరియట్ ప్రధాన గేటు (బహుబలి గేటు)ను శాశ్వతంగా మూసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు బాగాలేదనే కారణంతో ఈ చర్యలు చేపట్టినట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో కట్టిన గేటును మూసివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.