తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరతను తీర్చేందుకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్లను నియమించుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలో ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఎంపికైన వారికి ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.