Thorns festival: ముళ్లకంపపై దొర్లితే కోరిన కోర్కెలు నెరవేరతాయట.! ఏపీలో వింత ఆచారం

1 day ago 4
అనుకోకుండా కాలికి ముళ్లు గుచ్చుకుంటేనే ప్రాణం విలవిల్లాడిపోతుంటుంది. నడిచే తోవలో ముళ్లు కనిపిస్తే ఆగి మరి.. మనకే కాదు ఇంకెవ్వరికీ గుచ్చుకోకూడదని దాన్ని తీసి పక్కన పడేస్తుంటాం. ఇక ముళ్ల కంప కనిపించిందా.. ఆ తోవలో వెళ్లేందుకు ధైర్యం కూడా చేయం. అలాంటిది కళ్ల ముందు ఏకంగా ముళ్లకంపే ఉండి.. దానిపై బట్టలు లేకుండా దొర్లాలంటే.. అమ్మబాబోయ్ అంతకంటే నరకం ఇంకోటి ఉంటుందా..? ఒళ్లంతా ఛిద్రమైపోదూ..! కానీ.. వీళ్లు మాత్రం ముళ్లకంపపై దొర్లటమే ఓ సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ వింతైన, ఆసక్తికరమైన, అరుదైన ఆనవాయితీ.. ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. మర్రిపాడు మండలం.. తిమ్మానాయుడుపేట గ్రామంలోని మహాలక్ష్మమ్మ దేవాలయంలో.. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. మరి ఈ కంప తిరునాళ్ల మహోత్సవం విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Read Entire Article