మురసు తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరుతుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల డాబాల మీదకు చేరుతున్నారు. బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఇక ఏలూరు జిల్లా జిలుగుమిల్లు మండలం లక్ష్మీ పురం వద్ద జంగారెడ్డిగూడెం -అశ్వారావుపేట ప్రధాన రహదారికి గండి పడింది. వరద నీటిలో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో పంటలు కూడా పాడైపోవడంతో రైతులు వాపోతున్నారు.