తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు పోకుండా చూడాలని టీటీడీ ఇప్పటికే కేంద్ర విమానయాన సంస్థకు లెటర్ రాసింది. కానీ ఎన్నిసార్లు చెప్పిన స్వామి వారి ప్రధాన ఆలయం మీద నుంచి విమానాలు ఇప్పటికి కూడా ఎగుగుతున్నాయి. ఇది ఆగమ శాస్త్రంకు పూర్తిగా విరుద్ధం .ఇప్పటికి దీనిపై అనేక సందర్భాలలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా తిరుమలలో ఉదయం 8 గంటలకు స్వామి వారి ప్రధాన ఆలయం మీద నుంచి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు మండిపడుతున్నారు.