Tirumala laddu Row:: లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు..

2 weeks ago 2
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై అధ్యయనం జరిపి.. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article