తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వాహన సేవలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్సవాల్లో భాగంగా గురువారం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. కాగా, శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అయితే, ఈ కార్యక్రమానికి అర్చకులు, వేద పండితులు సమాయత్తం అవుతున్నారు. అయితే, అక్కడ ధ్వజ స్తంభం వద్ద ఉండే ఓ కొక్కెం విరిగిపోయింది.