విశాఖపట్నం శారదా పీఠానికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠం భవనం నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్డింగ్ ప్లాన్ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలను ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవన నిర్మాణాలను వెంటనే ఆపేయాలని ఆదేశించింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనంతరం కౌంటర్ దాఖలు చేసేందుకు శారదాపీఠం తరుఫు న్యాయవాది సమయం కోరగా.. కోర్టు అంగీకరించింది. విచారణను వాయిదా వేసింది.