తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు సైతం గ్రహించిందన్నారు. అందుకే సిట్ రద్దు చేసిందన్న జగన్.. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు రెక్కలు కట్టడం సనాతన ధర్మమా అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఏ తప్పూ జరగలేదని కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. సిట్టూ అవసరం లేదు, బిట్టూ అవసరం లేదంటూ జగన్ అభిప్రాయపడ్డారు. తప్పుడు రిపోర్టులు ఇస్తే స్వామివారే చూసుకుంటారన్నారు.