కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. గతంలోని ఉద్యమ పార్టీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా పేరు మార్చుకోవటం, ఆ సెంటిమెంట్ శూన్యాన్ని భర్తీ చేసేలా 'TRS' అక్షరాలతోనే పార్టీని ప్రారంభించడం వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం కొత్త పార్టీ స్థాపన మాత్రమే కాదని.. కేటీఆర్, హరీష్ నాయకత్వాన్ని ఆధిపత్యాన్ని వ్యతిరేకించే శ్రేణులకు ప్రత్యామ్నాయ వేదికగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చే అడుగని అంటున్నారు.