తెలంగాణ పోలీస్ నియాకమ మండలి నియామక ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం పెంచేందుకు ప్రతి అభ్యర్థికి యూనిక్ ఐడీ కేటాయిస్తున్నారు. దరఖాస్తు నుంచి తుది ఎంపిక వరకు అభ్యర్థి వివరాలు, రాత పరీక్ష మార్కులు, పీఎంటీ, పీఈటీ ఫలితాలు, తుది పరీక్ష ప్రతిభ, స్పెషల్ బ్రాంచ్ విచారణ వివరాలు ఇందులో నమోదు చేయనున్నారు. పార్ట్-1, పార్ట్-2 దరఖాస్తుల సమాచారాన్ని కూడా అనుసంధానం చేస్తారు. భవిష్యత్తులో ఫిర్యాదులు, న్యాయపరమైన వివాదాలు తలెత్తితే పూర్తి రికార్డులను ఆధారంగా తీసుకొని నిర్ణయాలు తీసుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.