Chennai Devotee Vardhman jain 6 crore Donation to TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీకి 6 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఎస్వీబీసీ ఛానెల్‌కు రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు చొప్పున మొత్తం ఆరుకోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. అయితే వర్ధమాన్ జైన్ గతంలోనూ టీటీడీ ట్రస్టులకు విరాళాలు సమర్పించుకున్నారు.