TTD: తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రారంభం అయిన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి వరకే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో కంపార్ట్‌మెంట్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. మరోవైపు.. అలిపిరి వద్ద వాహనాల రద్దీ నెలకొంది.