TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఈనెల 19వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్న నేపథ్యంలో.. అవి ముగిసిన తర్వాత ఏం చేయాలి అనే దానిపై టీటీడీ అధికారులు సమాలోచనలు చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి పాత పద్ధతిలోనే భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అయితే ఈనెల 20వ తేదీకి సంబంధించి.. సర్వదర్శన టోకెన్లు జారీ చేయమని.. భక్తులు నేరుగా క్యూ లైన్లలోకి చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.