తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల దర్శనం టికెట్ల కోటాకు సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్ల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కేటాయింపు వరకూ.. ఏయే సేవలకు ఎప్పుడెప్పుడు టికెట్లు విడుదల చేస్తారో టీటీడీ వెల్లడించింది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల దర్శనం కోసం ముందస్తుగా ప్రణాళిక వేసుకోవచ్చు. మరిన్ని వివరాలను టీటీడీ అదికారిక వెబ్ సైట్ సందర్శించాలని టీటీడీ సూచించింది.