హైదరాబాద్‌లో నీటి కొరత ఆందోళనల నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు దీపావళికి ముందుగానే విద్యార్థులకు తాత్కాలిక సెలవులు ప్రకటిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు కాలేజీలతోపాటు ఓయూ, కేయూలు కూడా విద్యార్థులకు సెలవులు ఇచ్చి.. ఆన్‌లైన్ తరగతులు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వర్సిటీల్లోని నీటి పరిస్థితిని తెలంగాణ ఉన్నత విద్యామండలి సమీక్షిస్తోంది. అవసరమైతే ఆన్‌లైన్ తరగతులు, విద్యా సంవత్సరం కుదింపు వంటి మార్గాలను పరిశీలిస్తోంది.