పురపాలిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్ఈసీపై కూడా ఆయన ఆరోపణలు చేస్తూ.. ఇవి ఎన్నికలు కావని.. కేవలం ఎంపికలు మాత్రమేనని ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా మాజీ సీఎం ఈ మేరకు పోస్ట్ పెట్టారు. అంతేకాదు, దేశంలో ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమే విషయం ఇంతకంటే ఎప్పుడూ స్పష్టంగా కనిపించలేదని జగన్ తన పోస్ట్‌లో పేర్కొనడం గమనార్హం.