TTD: తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది. భద్రతా వైఫల్యం మరోసారి టీటీడీ అధికారుల డొల్లతనాన్ని బయటపెట్టింది. ఏకంగా కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే వారు తెచ్చుకున్న కోడిగుడ్ల కూరను రోడ్డు పక్కన తింటుండగా గమనించిన ఇతర భక్తులు.. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ వ్యవహారం బయటికి వచ్చింది.