TTD VRS To Non Hindu Employees: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 33 మంది అన్యమత ఉద్యోగులకు ఉన్నతాధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగంలో చేరేటప్పుడు హిందువులమని ధ్రువీకరించి, తర్వాత ఇతర మతాలకు మారిన వారిపై ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వీఆర్ఎస్ తీసుకోగా, మిగిలిన వారికి పది రోజుల్లోగా అంగీకారం తెలపాలని సూచించారు. వీఆర్ఎస్‌కు అంగీకరించని వారిని ఇతర శాఖలకు బదిలీ చేస్తారు.