Tummala: తెలంగాణలో రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 26వ తేదీ నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారు. అయితే తాజాగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సమీక్ష నిర్వహించిన మంత్రి.. పరిష్కారాల్లో జాప్యంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.