UPI: టెక్నాలజీ పెరిగినకొద్దీ రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఇక బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఫోన్ నుంచే మనం చూసుకుంటూ ఉంటున్నాం. బ్యాంకుకు వెళ్లకుండానే అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ నుంచి లక్షల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాం. అయితే రోజుకో స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు.. అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జంప్‌డ్ డిపాజిట్ స్కామ్‌తో అనేక మంది మోసపోయి.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మొదట మన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసి.. ఆ తర్వాత ఖాతాను మొత్తం ఊడ్చేస్తారు.