vande bharat train hits cow: మహబూబాబాద్ జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్ వద్ద ఎద్దును ఢీకొనడంతో రైలు కొంతసేపు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి, పట్టాలపై ఉన్న ఎద్దు కళేబరాన్ని తొలగించారు. ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం దెబ్బతింది. రైల్వే ట్రాక్‌ల వెంట పశువుల సంచారం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.