సూర్యదేవ్ అనే యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి, పెద్దలను ఒప్పించి ఒకే పెళ్లి మండపంలో ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. పెళ్లి కార్డులో ఇద్దరి పేర్లను చేర్చి.. పెద్దలను పెళ్లికి కూడా ఆహ్వానించాడు. వారిద్దరూ అక్కాచెల్లెళ్ళు కాదు.. స్నేహితులు అంత కన్నా కాదు. అంతే కాదు.. వారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో సంతోషంగా చూసుకుంటానని బాండ్ పేపర్‌పై సంతకం కూడా చేశాడు. పెద్దలు దీనికి ఒప్పుకొని.. వారి ముగ్గురిని ఒకటి చేశారు.