తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన గాజువాక మౌనిక హత్య కేసులో.. మృతురాలి తండ్రి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కావటంతో పోలీసులు.. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మౌనిక తండ్రి వేణుగోపాల్ ఎమోషనల్ అయ్యారు. మౌనికను హత్య చేసిన రవీంద్రను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారం మాయమైందంటూ ఆయన ఆరోపించటం చర్చనీయాంశమైంది.